కాంగ్రెస్ లోక్ సభ కొత్త నేత మల్లిఖార్జున ఖర్గే…

AVN_KHADGEJI_635753fఎన్నికల ఎఫెక్ట్ నుంచి బయటపడుతున్న కాంగ్రెస్ పార్టీ.. తర్వాత కార్యక్రమాలపై ఫోకస్ చేస్తోంది. కొత్త లోక్ సభలో పార్టీని నడిపే నేతపై.. కాంగ్రెస్ పెద్ద కసరత్తే చేసింది. యువనేత రాహుల్ గాంధీకే పగ్గాలు అప్పగించాలని పార్టీ ఎంపీల నుంచి డిమాండ్ వినిపించినా.. చివరికి రైల్వే మాజీ మంత్రి మల్లిఖార్జున ఖర్గేను ఆ స్థానం వరించింది. లోక్ సభలో పార్టీ నాయకురాలిగా కొనసాగేందుకు….సోనియా ఇప్పటికే విముఖత చూపారు. దీంతో.. పార్టీని ఇప్పుడున్న పరిస్థితుల్లో.. రాహుల్ గాంధీ మాత్రమే ముందుకు నడిపించగలడని దిగ్విజయ్ సింగ్, శశి థరూర్ వంటి సీనియర్లు స్పష్టం చేశారు. కానీ.. లోక్ సభలో కాంగ్రెస్ నేత పదవికి రాహుల్ కూడా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో.. ఖర్గే పేరును సోనియా ప్రతిపాదించారు. ఆమె నిర్ణయాన్ని నేతలంతా స్వాగతించారు. మల్లిఖార్జున ఖర్గేను.. పార్లమెంట్ దిగువ సభలో పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నా…ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కేదీ లేనిదీ స్పీకర్ నిర్ణయంపై ఆధారపడింది. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే.. సభలో కనీసం 10 శాతం సీట్లు రావాలన్నది రూల్. కానీ.. 545 ఎంపీలున్న లోక్ సభలో.. కాంగ్రెస్ కు 44 మంది ఎంపీలే ఉన్నారు. దీంతో.. స్పీకర్ నిర్ణయమే.. లోక్ సభలో ప్రతిపక్ష నేత ఎవరన్నదీ నిర్ణయించనుంది.
అనుభవం.. సమర్థత ఆధారంగా సోనియా కట్టబెట్టిన పదవిని.. ఖర్గే ఎంతవరకు సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తారో చూడాలి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy