కాంగ్రెస్ లో చేరను.. ప్రచారం చేస్తా!….. రాహుల్ తో గద్దర్

ఢిల్లీ : దేశ రాజధానిలో భార్య, కుమారుడితో కలిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు ప్రజా గాయకుడు గద్దర్. పార్టీలో చేరుతారా అని రాహుల్ అడిగారనీ… ఏ పార్టీలో చేరనని తాను చెప్పాననీ అన్నారు. రాహుల్ తో ఎన్నికల పోటీ వంటి చర్చేమీ జరగలేదని… తన కుమారుడు ప్రచారానికి రమ్మంటే వెళ్తానని అన్నారు.

“రాజ్యాంగాన్ని కాపాడండి.. దేశాన్ని కాపాడండి” అనే ఉద్యమాన్ని రాహుల్ గాంధీ తీసుకున్నారనీ… దాని గురించి ఆయనను అడిగి తెల్సుకున్నానని చెప్పారు. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ప్రజల దగ్గరకు పోదాం అన్నదే తమ నినాదం అన్నారు.

“కేంద్రంలో ఫ్యూడలిజం(బుర్జువా వ్యవస్థ) పాలన సాగుతోంది.. అది పోవాలి. అందుకే రాహుల్ ఉద్యమానికి మద్దతు తెలిపాం. మా ఉద్యమాన్ని కూడా ఆయన ఆహ్వానించారు. నాపై జరిగిన తూటాల దాడిపై ఎలాంటి విచారణ జరపలేదు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. ఇంటికో ఉద్యోగం, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాననడం, భూమి ఇస్తానని ఇలా చాలా హామీలు మరచిపోయారు. నయా ఫ్యూడలిజం వచ్చింది. తెలంగాణలో కూడా రాజ్యాంగ రక్షణ అవసరం అయింది” అన్నారు.

“ప్రజా గాయకుడిగా పాటలతోనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పాను. సెక్యులర్ భావజాలం ఉన్నవారితో కలుస్తాం. సెక్యూలర్ పార్టీకి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటా. మిగిలిన సెక్యూలర్ పార్టీలను కూడా కలుస్తా. నయా బూర్జువా వ్యవస్థ అంతం చేయడమే నా లక్ష్యం. ఒకవేళ అన్ని పార్టీలు కోరితే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా” అన్నారు గద్దర్.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy