కాంగ్రెస్ 2లక్షల మందిని జీవచ్ఛవాలుగా మార్చింది: కేటీఆర్

ktrకాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉన్నంత కాలం ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు మంత్ర కేటీఆర్.  పదవుల కోసం పెదవులు మూసుకున్నరని విమర్శించారు. నల్గొండ జిల్లా చండూరులో మునుగోడు నియోజకవర్గ ప్రగతి సభకు ఆయన హాజరయ్యారు.

మునుగోడు ప్రజలు ఫ్లోరోసిస్ బాధలను ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలకు…ఎంతో మంది నాయకులకు చెప్పుకున్నారన్నారు మంత్రి కేటీఆర్.యాబై ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రజలకు చేసిందేమీ లేదని…2 లక్షల మంది ప్రజలను జీవచ్ఛవాలుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 ఏళ్ల కింద ఎమ్మెల్యేగా సిద్దిపేటలో ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లు ఇచ్చి ఫ్లోరోసిస్‌ను తరిమికొడుతామన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటే కాంగ్రెస్ మంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కరెంట్ చార్జీలు తగ్గించమంటే చంద్రబాబు కాల్పులు జరిపి ప్రజలను చంపించారన్న కేటీఆర్.. ముదిగొండ రైతులను చంపింది కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు.

అంతకుముందు చండూరులో తెలంగాణ తల్లి, ఆచార్య జయశంకర్ విగ్రహాలను మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి ఆవిష్కరించారు. చండూరు మండల కేంద్రంలో నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించనున్న రహదారుల విస్తరణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy