కాంట్రాక్లర్ల చేతికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు

Two-bedroom-house-planడబుల్ బెడ్ ఇళ్ల నిర్మాణాన్ని సీరియస్ గా తీసుకుంది సర్కార్. పనులను స్పీడప్ చేసింది. అవినీతి జరగకుండా పక్కాగా ప్లాన్ చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాటు మళ్లీ రిపీట్ కాకుండా ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టర్లకు అప్పగించాలని డిసైడైంది. దీని వల్ల నాణ్యతతో పాటు అక్రమాలు జరగకుండా ఉంటాయని భావిస్తోంది. హైద రాబాద్ లో ని ఐడీహెచ్ కాలనీలో  ఇప్పటికే ఇళ్ల నిర్మాణం చేపట్టింది సర్కార్. రొటీన్ కు భిన్నంగా జీ ప్లన్ వన్, టూ పద్ధతిలో  369 ఇళ్లను నిర్మిస్తోంది.  వరంగల్ లోని  ఆరు మురికి వాడల్లో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. అంబేడ్కర్ నగర్ లో 592, ఎస్ ఆర్ నగర్ లో 792 ఇళ్ల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో యూనిట్ కు ఐదు లక్షలకు పైగా ఖర్చు కానుంది.

నియోజవర్గానికి 500 ఇళ్ల చొప్పున  రెండు లక్షల ఇళ్ల  నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. జిల్లాల్లోనూ జీ ప్లస్ పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.   సమగ్ర సర్వే నివేదిక ఆధారంగా గ్రామ సభలు ఏర్పాటు చేసి,  అర్హుల జాబితాను రెడీ చేయనున్నారు అధికారులు. ప్ర భుత్వ మే టెండర్లు పిలిచి, ఈ ప్రొక్యూర్ మెంట్ సిస్టమ్ ద్వారా ఇళ్ల నిర్మాణాన్ని  కాంట్రాక్టర్లకు అప్పగించనుంది.

పెరిగిన  ధరల ప్రకారం ఒక్కో ఇంటికి ఏడు లక్షల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే కాంట్రాక్టర్లకు అప్పగించడంతో పాటు ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల  ఖర్చు తగ్గుతుందని సర్కార్ లెక్కలేస్తోంది. ఇళ్ల నిర్మాణం  550 చదరపు అడుగుల నుంచి 450కి కుదించడం వల్ల  మూడు లక్షలు సేవ్  అవుతుందని  అంచనా వేస్తోంది. పల్లెల్లో ఇళ్ల నిర్మాణ ఖర్చు మూడున్నర లక్షలు దాటకుండా  జాగ్రత్త పడుతోంది ప్రభుత్వం. ఇంద్రకరణ్ రెడ్డి లేదా..సిఎం కేసిఆర్ బైట్ వాడగలరు. విపక్షాల నుంచి విమర్శలు రాకుండా  ఇళ్ల నిర్మాణం పక్కగా ఉండేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy