కాకా సేవలు చిరస్మరణీయం: సీఎం కేసీఆర్

Bookపేదల పక్షపాతి కాకా అన్నారు ఆయన జయంతి వేడుకల్లో పాల్గొన్న వక్తలు. జీవితాన్ని పేదలకు అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారి, కేంద్రమంత్రి దత్తాత్రేయ, సీఎం కేసీఆర్ ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. వారి మాటల్లోనే…

సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి కాకా: మధుసూదనాచారి

సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్పవ్యక్తి కాకా అని కొనియాడారు స్పీకర్ మధుసూధనాచారి. పేదలు,కార్మికుల సంక్షేమం కోసం కాకా ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వంలో కదలిక రావడానికి  జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నేత వెంక వ్యక్తి వెంకటస్వామి.. అని కొనియాడారు స్పీకర్ మధుసూదనాచారి.

కాకా జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి: దత్తాత్రేయ

కాకా జీవితచరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని సీఎంను కోరారు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ. పేదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వెంకటస్వామి చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేదలతో పాటు.. కార్మికుల సంక్షేమం కోసం కాకా ఎంతో కృషి చేశారన్నారు.  ప్రైవేటు రంగ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించిన ఘనత కూడా కాకాకే దక్కుతుందన్నారు దత్తత్రాయ.

స్వరాష్ట్రాన్ని కళ్లారా చూశారు: సీఎం కేసీఆర్ 

పేదల సంక్షేమం కోసం నిరంతం కృషి చేసిన గొప్పవ్యక్తి వెంకటస్వామి అని కొనియాడారు సీఎం కేసీఆర్. ట్యాంక్ బండ్ పై కాకా విగ్రహం పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తపనపడి.. రాష్ట్ర ఏర్పాటును కళ్లారా చూసిన ధన్యజీవి కాకా అన్నారు. ప్రత్యక్షంగా ఉధ్యమంలో పాలుపంచుకోవడంతోపాటు.. సలహాలు, సూచనలు చేశారన్నారు.

కాంగ్రెస్ అభివృద్ధిలో కాకా పాత్ర చిరస్మరణీయం: పళ్లం రాజు, సురేశ్ రెడ్డి

దివంగత నేత వెంకటస్వామి ప్రజల మనిషన్నారు కేంద్ర మాజీ మంత్రి పళ్లం రాజు. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఆయన పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. కాక జీవించి ఉంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఆయన సూచనలు, సలహాలు ఎంతో ఉపయోగపడేవన్నారు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి. పేదల అభివృద్ధికి కాక ఎంతో తోడ్పడ్డారని కొనియాడారు. ట్యాంక్ బండ్ పై కాక విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy