కాకా జయంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు

Venkataswamy_6కార్మిక నేత, అమరజీవి కాకా 86 జయంతి ఉత్సవాలను గ్రాండ్ గా నిర్వహించేందుకు రెడీ అయింది సర్కార్. ట్యాంక్ బండ్ లోని సాగర్ పార్క్ లో విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేసింది. రేపు జరగనున్న జి. వెంకటస్వామి జయంతి వేడుకలకు సీఎం కేసీఆర్ తో పాటు డిప్యూటీ సీఎం కడియం , కాకా కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.

అరవై ఐదేళ్ల రాజకీయ జీవితం, దేశంలోనే సీనియర్ నేత, ఉద్యమకారుడు, గాంధేయవాది, తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు, దళిత నేత గడ్డం వెంకటస్వామి. పేదల నాయకుడిగా ఎదిగి కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.  కాకాగా జనం ప్రేమగా పిలుచుకునే జీవీ … గత ఏడాది డిసెంబర్లో కన్నుమూశారు. ఆయన సేవలను అరుదైన గౌరవంతో స్మరించుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం .

తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన కొద్దిమంది నాయకుల్లో వెంకటస్వామి ఒకరు. రాజకీయాలకే పరిమితం కాకుండా పేదల ఇళ్లు, కార్మికుల హక్కులు, బడుగు వర్గాల విద్యావకాశాల కోసం పోరాడిన గొప్ప నేత కాకా. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలపై తనదైన ముద్ర వేశారు. ప్రతి క్షణం ప్రత్యేక రాష్ట్రం కోసం పరితపించారు. కాకా సేవలకు గుర్తుగా హైదరాబాద్ లో ఆయన స్మారక కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సర్కార్. నెక్లెస్ రోడ్ లో స్మారక భవన్ ఏర్పాటు బాధ్యతను HMDA కు అప్పగించారు సీఎం కేసీఆర్.  కాకా 86 వ జయంతి వేడులకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. రేపు ట్యాంక్ బండ్ లోని సాగర్ పార్క్ లో  కాకా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం కేసీఆర్.  కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ మంత్రి జి.వినోద్, మాజీ ఎంపీ వివేక్  ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. వెంకటస్వామి ఆత్మకథ ‘మేరా సఫర్’ పుస్తకాన్ని కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆవిష్కరించనున్నారు. కాకా ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాకలు తీరిని తెలంగాణ వాది, పేద, బడుగు వర్గాల నేతగా ఆయన సేవలు భావితరాలకు తెలిసేలా  జయంతి వేడులకు గ్రాండ్ గా నిర్వహించనుంది ప్ర్రభుత్వం.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy