కాకా ప్రస్థానం

KAKA 475గూడులేనోడికి గూడు చూపించాడు… బడుగులకు ఆశాజ్యోతిగా నిలిచాడు…  రాజకీయరంగంలో అప్రతిహత ప్రస్థానంతో ఆజాతశత్రువయ్యాడు… దళితలోకానికి సూర్యుడయ్యాడు… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రోద్యమ ఆదిఅంతాలను చూశాడు…. ఆయనే జి. వెంకటస్వామి. కాకా అంటూ అందరూ గౌరవంగా పిలుచుకునే ఆయన 87వ జయంతి ఇవాళ. 1929 అక్టోబర్ 5న పుట్టారు. ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మలుపులు.. మరెన్నో ఎత్తులు. జీవితాంతం పేద ప్రజల కోసం, కార్మికుల కోసం పని చేశారు. కార్మికుల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన కార్మిక పక్షపాతి కాకా.  1957, 1978లలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికై మంత్రిగా పని చేశారు. ఏడు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. 1982- 84 మధ్యలో పీసీసీ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. నాటి ఇందిరాగాంధీ నుంచి ఇవాళ్టి సోనియాగాంధీ వరకు గాంధీ నెహ్రూ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా… గాంధేయవాద సిద్ధాంతాలను జీవితాంతం ఆచరించి చూపిన నికార్సైన నాయకుడు కాకా.  ఆయన జీవనయానంలోని మధురజ్ఞాపకాలు మీకోసం…

1723465

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy