కాజల్ తోనే మెగాస్టార్ రొమాన్స్..

chiru-kajalచిరు ప్రెస్టీజియస్ 150వ చిత్రానికి హీరోయిన్ ఎవరన్నదాని పై గత కొంతకాలంగా  జోరుగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ  చిత్రానికి హీరోయిన్ కన్ఫార్మ్ అయ్యింది. మెగాస్టార్ కు జోడిగా ముంబై ముద్దుగుమ్మ కాజల్ ను  చిత్ర యూనిట్ సెలెక్ట్  చేసింది. ఒక మంచి సామాజిక అంశం నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాలో నటించేందుకు కాజల్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోందట. మెగాస్టార్ తనయుడు.. మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్ కాగా మాస్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందిన వి.వి వినాయక్ చిరు 150 వ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. మరో వైపు చిత్రానికి మొదటగా కత్తిలాంటోడు అనే టైటిల్ ప్రచారంలో ఉండగా తాజాగా నెపోలియన్ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. ఈ చిత్రం చాలా ప్రతిష్టాత్మకం కావటంతో చిత్ర బృందం..అన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేస్తోంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy