కాటమరాయుడు న్యూ పోస్టర్

pavanసర్ధార్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ చేస్తోన్న తాజా చిత్రం కాటమరాయుడు. మార్చిలో విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానులలో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. తమిళ చిత్రం ‘వీరమ్’కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఐదుగురు అన్నదమ్ముల నేపథ్యంలో నడవనుండగా, ఇందులో పవన్ గెటప్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. కాటమరాయుడు లో కథానాయికగా శృతి హాసన్ నటిస్తోండగా, పవన్ కి తమ్ముళ్లుగా అజయ్, శివ, బాలాజీ , కమల్ కామరాజు నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజా పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.  ఈ పోస్టర్ అభిమూనులను బాగా ఆకట్టుకొంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో చక్కని ప్రేమకథాంశంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డాలీ అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy