కానరాని రూ.250 కోట్ల వజ్రం.. రంగంలోకి ఇంటర్ పోల్

HONG_KONG_PINK_DIAMOND_XVY103-2017MAR29_091900_607.jpgకోట్ల విలువ చేసే పింక్ డైమండ్ కోసం ప్రపంచ దేశాల పోలీసులు గాలిస్తున్నారు. ఫ్రాన్స్‌, లెబనాన్‌, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, దుబాయ్‌, రష్యా.. ఈ దేశాల పోలీసులు దొంగను పట్టేందుకు రంగంలోకి దిగారు. ఆ వజ్రం విలువ రూ.250 కోట్లు ఉంటుందని చెబతున్నారు. ఈ కేసులో నలుగురు భారతీయ ఆఫ్రికన్లు జునైద్‌ మోతీ, అబ్బాస్‌ అబూబకర్‌ మోతీ, అష్రఫ్‌ కాకా, సలీం బొబట్‌లకు ఇంటర్‌పోల్‌ రెడ్‌ నోటీసులు జారీ చేసింది. ప్రపంచంలో ఎక్కడున్నా అరెస్టు చేయాలన్నది దాని సారాంశం. అయితే వీరు ప్రస్తుతం ఆ నోటీసులను నిలిపివేయాలంటూ ప్రిటోరియా హైకోర్టును ఆశ్రయించారు.

వివరాల్లోకి వెళితే.. కొన్నేళ్ల క్రితం రష్యాకు చెందిన టెలికమ్యూనికేషన్‌ టైకూన్‌ తో పింక్‌ డైమండ్‌ను అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ నలుగురు. రూ.250 కోట్లకు బేరం కుదిరింది. చివరి నిమిషంలో… వజ్రం కనపడటం లేదంటూ చేతులెత్తేశారు. అప్పటి నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. దీని విషయమయ్యే రెడ్ నోటీస్ జారీ చేసింది ఇంటర్ పోల్. తమతో పాటు బిజినెస్‌ నడిపిన మాజీ భాగస్వామి అలిబెక్‌ ఇస్సేవ్‌ అనే వ్యక్తిపై నలుగురు భారత ఆఫ్రికన్లు ఆరోపణలు చేశారు. ప్రిటోరియా కోర్టులో ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. ఇస్సేవే అసలు దోషి అని, అతనే వజ్రాన్ని అపహరించాడని చెప్పారు. తమపై ఇంటర్‌పోల్‌ జారీ చేసిన రెడ్‌ నోటీసుపై స్టే ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.

అంతర్జాతీయ వజ్రాల వ్యాపారి సైల్లా మౌస్సా తాజాగా చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని రేపుతున్నాయి. 2003లో పింక్‌ డైమండ్‌ను తన నుంచి నలుగురు భారత ఆఫ్రికన్లు అపహరించుకుపోయారని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఆ పింక్‌ డైమండ్‌ తనదేనని ఆయన అంటున్నారు. అయితే, దీనిపై మాట్లాడిన నలుగురు భారతీయ ఆఫ్రికన్లలో ఒకరైన కాకా.. తమకు పడిన బాకీని చెల్లించేందుకు పింక్‌ డైమండ్‌ను మౌస్సానే ఇచ్చారని చెప్పారు. కాగా, ఇంటర్‌పోల్‌ జారీ చేసిన నోటీసులు ఇంతవరకూ తమకు చేరలేదని దక్షిణాఫ్రికా పోలీసులు తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy