కానిస్టేబుల్ కు రక్తదానం చేసిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్

అకస్మాత్తుగా రక్తంలో ప్లేట్లు తగ్గి ఆపదలో ఉన్న కానిస్టేబుల్ కు రక్తదానం చేసి కాపాడాడు ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. కానిస్టేబుల్ బాలాజీ కి తక్షణమే Aపాజిటివ్ బ్లడ్ అవసరం కాగా విషయాన్ని వాట్సాప్ ద్వారా తెలుసుకున్న ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అంజపల్లి నాగమల్లు తనది A పాజిటివ్ గ్రూప్ కావడంతో సరూర్ నగర్ చెరువు వద్ద వినాయక నిమజ్జనం డ్యూటీలో ఉండగా వెంటనే అధికారుల అనుమతి తీసుకొని రాత్రి 12 గంటలకు కామినేని హాస్పిటల్ కి చేరుకొని రక్తదానం చేశాడు. తోటి వారు ప్రమాదాల్లో ఉన్నప్పుడు పగలు రాత్రి అని చూడకుండా ఆదుకోవాలని నిరూపించాడు అంజపల్లి. అతను గతంలో కూడా 21సార్లు రక్తదానం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ పలువురికి ఆ ఇన్సెపెక్టర్ రక్తదానం చేసి కాపాడాడని అభినందించారు.

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy