కానిస్టేబుల్ కొలువులకు దరఖాస్తులు ఇవాళ్టి నుంచే

TS-Conistable9 వేల 281 కానిస్టేబుల్ పోస్టుల రిక్రూట్ మెంట్ ప్రక్రియ.. ఇవాళే మొదలు కానుంది. ఫిబ్రవరి 4 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు తీసుకోనుంది రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్. వయసు రూల్స్ సడలించడంతో.. ఈ సారి లక్షల్లో అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఓసీ, బీసీ అభ్యర్థులు 400 రూపాయలు.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 200 రూపాయల ఫీజు చెల్లించాలి. మీ సేవ, ఈ సేవ, టీఎస్ ఆన్ లైన్, ఏపీ ఆన్ లైన్, నెట్ బ్యాంకింగ్ విధానాల్లో ఫీజు చెల్లించాలి. తర్వాత.. WWW.TSLPRB.IN వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రశీదుకు సంబంధించి రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చాక.. మై అప్లికేషన్ క్లిక్ చేసి అభ్యర్థులు పూర్తి వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తయ్యాక.. అభ్యర్థి మొబైల్ కు మెసేజ్ అందుతుంది. మెయిల్ ఐడీకి పూర్తి వివరాలు అందుతాయి. ప్రిలిమినరీ పరీక్షకు వారం ముందు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

జనరల్ కేటగిరి అభ్యర్తులకు వయో పరిమితి 25 ఏళ్లు కాగా.. హోంగార్డులుగా పని చేస్తున్న వారికి మాత్రం 33 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. మహిళలకు సివిల్ పోలీసుల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. వయో పరిమితి సడలించడంతో.. ఈ సారి లక్షల సంఖ్యలో దరఖాస్తులు రావొచ్చని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 9 వేల 281 పోస్టులకు దరఖాస్తులు తీసుకోనున్నారు. ఇందులో.. టీఎస్ఎస్పీ లో 4 వేల 65 పోస్టులు.. ఆర్మ్ డ్ రిజర్వ్ విభాగంలో 2 వేల 760…. సివిల్ విభాగం నుంచి 1810 కానిస్టేబుల్.. ఫైర్ డిపార్ట్ మెంట్ లో 416.. ఎస్పీఎఫ్ లో 174… ఎస్ఏఆర్సీపీఎల్ లో 56 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

గతంతో పోలిస్తే.. పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపిక విధానం దాదాపుగా మారిపోయింది. ఏప్రిల్ 3న జరగనున్న ప్రిలిమినరీ పరీక్షలో.. 200 మార్కులకు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నాపత్రం ఇస్తారు. జనరల్ 40.. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. పరుగు పందెం కారణంగా గతంలో చాలా మంది ప్రాణాలు వదిలిన సందర్భాలు ఉండడంతో.. ఈ సారి 5 కిలోమీటర్లు, రెండున్నర కిలోమీటర్ల పోటీలను పక్కనపెట్టారు. పురుషల విభాగంలో 800 మీటర్లు.. మహిళల విభాగంలో 100 మీటర్ల పరుగు పందేన్ని కండక్ట్ చేయనున్నారు. చివరగా.. ఇంటర్మీడియట్ స్థాయిలో 200 ప్రశ్నలతో ఫైనల్ పరీక్ష నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేస్తారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy