కానిస్టేబుల్ రిక్రూట్‌ మెంట్‌ : ఛాతిపై కులం పేరు

mp-policeదేశ ప్రజల్లో కుల మతాలను రూపుమాపడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటే.. మధ్యప్రదేశ్‌ పోలీసు అధికారులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. ఆ రాష్ట్ర కానిస్టేబుల్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్‌ నియామక పరీక్షల్లో పోలీసు అధికారులు తీరు పలు విమర్శలకు దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాలను చేపట్టింది. ఈ సందర్భంగా రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా అభ్యర్థుల ఛాతి కొలిచిన సిబ్బంది వారి కులం పేరును ఛాతిపై రాయడం వివాదంగా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ లోని ధార్‌ జిల్లా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. దీనిపై జిల్లా సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ బైరేంద్ర సింగ్ స్పందిస్తూ… ఇది చాలా తీవ్రమైన అంశమని, దీనిపై విచారణకు ఆదేశించామని తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy