కాపాడిన పోలీసులు : హుస్సేన్ సాగర్ లో.. ముగ్గురు మహిళలు ఆత్మహత్యయత్నం

HYD WOMEN DEATHSహైదరాబాద్ పోలీసులు ముగ్గురి మహిళలకు పునర్జన్మనిచ్చారు. భర్త వేధింపులతో ఓ మహిళా..ప్రేమించి పెళ్లిచేసుకోలేదని మరో మహిళా..ప్రేమించి పెళ్లి చేసుకుని అత్తా మామలకు పరిచయం చేయలేదని మూడో మహిళ. ఇలా ఒకరికొకరు సంబంధంలేకుండా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. వీరందరూ కూడా హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లోనే దూకి మరణించాలనుకున్నారు. అయితే వీరిని గమనించిన లేక్ పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహారంచి కాపాడారు.

వివరాల్లోకెళితే..రాజేందర్ నగర్ బండ్లగూడకు చెందిన రత్నకుమారి అనే మహిళా.. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త వేధింపులు తట్టుకోలేక హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అలాగే..కుశాయిగూడకు చెందిన మరో మహిళా ప్రేమించి పెళ్లి చేసుకుని తన అత్తమామలు దగ్గరకు తీసుకు వెళ్లలేదని మనస్థాపానికి గురై ఆత్మహత్య ప్రయత్నం చేసింది. మూడో మహిళ విషయానికొస్తే.. ముషీరాబాద్ భోలక్ పూర్ కు చెందిన ఆమె.. గత రెండు సంవత్సరాలుగా తనను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని చనిపోవాలనుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy