కాబూల్‌ లో ఆత్మాహుతి దాడి : 31మంది మృతి

KABULఆత్మాహుతి దాడితో అఫ్గానిస్తాన్‌ మరోసారి ఉలిక్కిపడింది. ఆదివారం (ఏప్రిల్-22) అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది మృతి చెందగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ధృవీకరించారు. కాబూల్‌ లోని ఓటరు నమోదు కేంద్రం ప్రవేశ మార్గంలో ఈ దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఈ దాడికి పాల్పడింది ఎవరనేది తెలియరాలేదు. తాలిబన్‌ ఉగ్ర సంస్థ మాత్రం దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది.

అక్టోబర్‌ లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 14 నుంచి దేశవ్యాప్తంగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఓటరు నమోదు కేంద్రం వద్ద ఉన్న జనసమూహాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ గుర్తు తెలియని దుండగుడు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. చివరిసారిగా కాబూల్‌ లో ఈ సంవత్సరం మార్చి 21న ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో 29 మంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy