కాబూల్ లో ఆత్మాహుతి దాడి:30 మంది మృతి

blustఆత్మాహుతి దాడిలో సుమారు 30 మంది మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌కు దగ్గరలో ఉన్న ఒక మసీదులో జరిగింది. శుక్ర‌వారం( అక్టోబర్-20) కావ‌డంతో.. ప్రార్ధ‌న‌ల తర్వాత మ‌సీదు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న భ‌క్తుల మ‌ధ్య‌లో చేరి ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్ప‌డ్డాడు. ఈ దాడిలో ఇప్ప‌టి వ‌ర‌కు 30 మృత దేహాల‌ను గుర్తించామ‌ని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశ‌ముంద‌ని అధికారులు అంటున్నారు. అయితే ఇంతవరకూ గాయపడిన వారి సంఖ్య కూడా భారీగానే ఉండే అవకాశముందన్నారు పోలీసు అధికారులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy