కాబూల్ లో ఉగ్రదాడి-ఐదుగురు మృతి

kabulఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌లో ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌పై దాడి చేసిన ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి నజీబ్ డానిష్ చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ దాడిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక విదేశీయుడు ఉన్నట్లు తెలిపారు. ఈ హోటల్‌లో బందీలుగా ఉన్న 153 మందిని నిర్బంధం నుంచి విముక్తి చేసినట్లు చెప్పారు.

కాబూల్‌లోని ఇంటర్‌ కాంటినెంటల్‌ హోటల్‌లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. శనివారం(జనవరి-20) రాత్రి భవనంలోకి ప్రవేశించిన నలుగురు టెర్రరిస్టులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. గదులకు నిప్పుపెట్టారు. హోటల్‌లోని అతిథులే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు.

ఆదివారం(జనవరి-21) జరగనున్న సమాచార సాంకేతిక సదస్సు కోసం వచ్చిన కొందరు విదేశీయులు ఈ హోటల్‌లో బస చేసేందుకు వచ్చారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy