కాబోయే సుప్రీం సీజే జస్టిస్‌ దీపక్‌ మిశ్రా

eepakసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాని నియమించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జగదీశ్‌ సింగ్‌ ఖెహర్‌ ఈ నెల 27న పదవీ విరమణ చేయనున్నారు. తత్ఫలితంగా కొత్త సీజేని ఎంపిక చేసినట్లు కేంద్ర న్యాయ శాఖ మంగళవారం వెల్లడించింది. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా 1953 అక్టోబర్‌ 3వ తేదిన ఒడిసా రాష్ట్రంలో జన్మించారు. రాజ్యాంగ, సివిల్‌, క్రిమినల్‌, రెవెన్యూ, సర్వీస్‌, సేల్స్‌ ట్యాక్స్‌ సంబంధిత అంశాలపై న్యాయవాదిగా ఒడిసా హైకోర్టులో పలు కేసుల్లో వాదించారు. ఒడిసా హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997 మార్చి 3న మధ్య ప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2010 మే 24నఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2011 అక్టోబరు 10న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్‌ ఖేహర్‌ పదవీ విరమణ అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2018 అక్టోబరు 2 వరకూ సేవలందించనున్నారు. ఒడిసా నుంచి సుప్రీం సీజే అయిన మూడో వ్యక్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా. గతంలో ఒడిసా రాష్ట్రానికి చెందిన ఇద్దరు.. జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా, జీబీ పట్నాయక్‌ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా  పనిచేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy