కాయ్ రాజా కాయ్..!

cock fightకోర్టు నిషేధం పెట్టింది. పోలీసులు కూడా ఊరుకోం అన్నారు. కానీ, ఎవరూ అడ్డుకోలేకపోయారు. ఆంధ్రాలోని గోదావరి జిల్లాల్లో కోడిపందాలు దర్జాగా జరిగిపోతున్నాయ్. నాయకుల పంతం…. కొక్కొరొక్కోల పందెం….హోరెత్తిపోతోంది. గోదావరి జిల్లాల్లోనే కాదు, క్రుష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా కోడిపుంజులు పందానికి సై అంటే సై అంటున్నాయి.

‘కాయ్ రాజా కాయ్!  నెమలిమీద కాయ్, డేగమీద కాయ్. వేలకు వేలు గెలిచేయ్.’ ఆంధ్రా కోస్తా జిల్లాల్లో ఎక్కడ చూసినా ఇవే అరుపులు. ముఖ్యంగా గోదావరి జిల్లాలు కోడి కూతలతో మార్మోగిపోతున్నాయ్. బరిలోకి దిగి కో అంటే కో అంటూ భీకరంగా ఢీ కొడుతున్నాయ్.

 

cock fight bmvrmఇది భీమవరం దగ్గర ఒక బరి. లక్షలు పోసి కొని….వేలు ఖర్చు పెట్టి మేపి. పందాలకు తీసుకొచ్చారు ఓనర్లు. ఎప్పుడెప్పుడు ఢీ కొడదామా అని రెడీ అవుతున్న కోడిపుంజులు ఒకపక్క, టేబుళ్ళమీద గడుల్లో డబ్బుల రాశి పోగుచేస్తూ బెట్టింగ్ లో బిజీ అవుతున్నవాళ్ళు మరో పక్క….ఎంత కోలాహలంగా ఉందో చూశారా?

భీమవరం దగ్గరే కాదు, వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండి, వెంప, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, వెంకటరామాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో కూడా పందాలు జోరుగా సాగుతున్నాయ్. ఈస్ట్ గోదావరి జిల్లాలో అమలాపురం, రావులపాలెం, ముమ్మిడివరం, రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్ ప్రాంతాల్లో కూడా పందాలు చాలా హుషారుగా జరుగుతున్నాయ్.

 

cock fight 11

మరి పోలీసులు ఏం చేస్తున్నారనే అనుమానం సహజం. కొన్నిచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. కోళ్ళను, డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, దాడులు దాడులే. పందాలు పందాలే. ప్రస్తుతానికి పందాలరాయుళ్ళదే హవా.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy