కారుపై డెడ్ బాడీ – కిలోమీటర్ జర్నీ

dead body on car 1నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు దాటుతున్న టూ వీలర్ ను ఢీ కొట్టింది ఓ కారు. ఢీకొట్టడమే కాదు… అలాగే దూసుకుపోయింది. అయితే దానిపై ఉన్న ఆ వ్యక్తి అలాగే ఎగిరి అదే కారుపై పడ్డాడు. అక్కడికక్కడే చనిపోయాడు. అయినా కారును ఆపకుండా దూసుకుపోయాడు డ్రైవర్. అలా కిలోమీటర్ దూరం పైనే వెళ్లిపోయాడు. అయితే దీన్ని గమనించిన స్థానికులు ఆ కారును వెంటాడి పట్టుకున్నారు. ఇన్సిడెంట్ కట్టంగూర్ దగ్గర జరగగా… ఐటిపాముల దగ్గర కారును పట్టుకున్నారు పోలీసులు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ మద్యం సేవించాడని చెబుతున్నారు పోలీసులు.

dead body on car 2

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy