కారు యాక్సిడెంట్ : గౌతమ్ మీనన్ కు గాయాలు

gautham_menon_accident_750‘ఏం మాయచేసావే’ డెరెక్టర్ గౌతమ్ మీనన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. గురువారం (డిసెంబర్-7) మహాబలిపురం నుంచి చెన్నైకి కారులో ప్రయాణిస్తుండగా శోలింగనల్లూరు సిగ్నల్ వద్ద ఆయన కారు, టిప్పర్ లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో గౌతమ్ మీనన్‌కు పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన ప్రయాణిస్తున్న కారు మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. స్వల్పంగా గాయపడిన ఆయన ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. లవ్ స్టీరీస్ తీయడంలో పాపులర్ అయిన గౌతమ్‌ మీనన్‌.. తమిళంతో పాటు తెలుగులో పలు సూపర్‌హిట్ సినిమాలను తెరకెక్కించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy