కారు లేదు.. వందల కోట్లు లేవు.. ప్రధాని మోడీ ఆస్తి ఇంతే..!

ఢిల్లీ : సొంత కారు లేదు…. వందల కోట్ల ఆస్తి లేదు. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడబెట్టిన ఆస్తుల వివరాలు చూస్తే షాకవ్వాల్సిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తుల వివరాలను కేంద్రప్రభుత్వం విడుదల చేసింది. చాయ్ వాలా స్థాయి నుంచి దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన నరేంద్రమోడీ ప్రాపర్టీ విలువ ఎంతో తెల్సుకున్నవాళ్లంతా ఇంతేనా.. అనుకుంటున్నారు.

మార్చి 31, 2018 వరకు నరేంద్రమోడీకి చెదింన ఆస్తుల వివరాలను వెల్లడించింది కేంద్రం. వీటి విలువ రూ.2కోట్ల 28 లక్షల రూపాయలు. ఇందులో.. గుజరాత్ గాంధీనగర్ లోని మోడీ నివాస స్థలం విలువ కోటి రూపాయలు. రూ.కోటి 28 లక్షల విలువైన చరాస్థులు మోడీ పేరిట ఉన్నాయి. అప్పటికి ప్రధాని మోడీచేతిలో ఉన్న డబ్బు రూ.48వేల 944 రూపాయలు. మోడీకి కనీసం సొంత కారు కూడా లేదని కేంద్రం ప్రకటనలో తెలిపింది.

గాంధీనగర్‌లో దాదాపు 900 చదరపు అడుగుల ఇంటి స్థలాన్ని 2002లో మోదీ  లక్ష రూపాయలకు కొనుక్కున్నారు. ఆ స్థలం మార్కెట్‌ విలువ ఇపుడు కోటి రూపాయలకు పెరిగింది. గాంధీనగర్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌ బ్రాంచీలో నరేంద్రమోడీకి ఒక అకౌంట్ ఉంది. మార్చి 31 నాటికి ఆ బ్యాంక్ అకౌంట్ లో 11 లక్షల 29వేల 690 డబ్బుంది. అదే బ్రాంచీలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మల్టీ ఆప్షన్ డిపాజిట్‌ స్కీమ్‌ల రూపంలో రూ. 1 కోటి ఏడులక్షల పెట్టుబడులు ఉన్నాయి. ఇవి గాక రూ.5 లక్షల 18 వేల విలువ గల జాతీయ పొదుపు బాండ్‌, రూ. 1లక్షా 59 వేల జీవిత బీమా పాలసీ ఉంది.

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ ఎలాంటి బంగారు ఆభరణాలు కొనలేదు. ప్రస్తుతం మోడీ చేతికి నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి విలువ ఒక లక్షా 38 వేలు ఉంటుంది. ఏ బ్యాంక్ నుంచి మోడీ లోన్లు తీసుకోలేదని కేంద్రం తెలిపింది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy