కార్తీక మాసం స్పెషల్‌ ఆఫర్స్‌‌‌‌: చికెన్‌ పై డిస్కౌంట్

కార్తీకమాసం వచ్చిందంటే చాలు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు…ఉపవాసాలుంటారు. అంతా వెజ్‌ వైపే చూస్తారు.నాన్‌‌‌‌వెజ్‌ తినేవారి సంఖ్య చాలా తక్కు వగా ఉంటుంది . కొనేవారు లేనప్పుడు వ్యాపారులకు ఆ సమయంలో నష్టం వచ్చే అవకాశముంది. అందుకే ఆఫర్లతో అమ్మకాలు పెంచుకోవాలని చూస్తున్నారు. ఇందులో ఒకడుగు ముందే ఉన్నారు చికెన్‌‌‌‌ వ్యాపారులు. తమ షాప్ ల  దగ్గర తగ్గిన ధరలు,మెగా ఆఫర్లు అంటూ బ్యానర్లు ఏర్పాటు చేసి చికెన్‌‌‌‌ ప్రియులను షాప్‌‌‌‌లకు రప్పించుకుంటున్నారు. కొంత మంది కేజీ చికెన్ పై 20శాతం డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం స్కిన్‌‌‌‌‌‌లెస్‌ చికెన్‌‌‌‌‌‌‌‌ కేజీ రూ.163 నుంచి రూ.168 వరకు ఉంది . కానీ ఆఫర్లతో.145 నుంచి రూ.148 వరకు అమ్ముతున్నారు వ్యాపారులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy