కార్తీతో సరదాగా గడిపాను : రకుల్

rakul‘జయ జానకి నాయక’ సినిమా హిట్ తో ఎంజాయ్ చేస్తున్న అందాల భామ రకుల్ వరుస సినిమాలతో మంచి జోరుమీదుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్ లో కార్తీతో నటిస్తున్న ‘ఖాకీ’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హెచ్‌. వినోథ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మొహ్మద్‌ గిబ్రన్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను మంగళవారం(సెప్టెంబర్-12) రిలీజ్ చేశారు. దీన్ని రకుల్‌ ట్విట్టర్ లో పోస్ట్ చేసి, అభిమానులతో పంచుకుంది. కార్తీతో షూటింగ్‌ చాలా సరదాగా జరిగినట్లు ఆమె ట్వీట్‌ చేసింది.

కార్తీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించనున్న ఈ మూవీ.. అక్టోబరులో విడుదల కాబోతోంది. కార్తీ ఈ ఏడాది ‘చెలియా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఇదిలావుంటే టాలీవుడ్ లో రకుల్‌  మహేశ్‌ సరసన నటించిన ‘స్పైడర్‌’ సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy