కార్పొరేట్ స్కూల్ అరాచకం : బాతులా నడిపించి.. బలి తీసుకున్నారు

duck-walkకార్పొరేట్ స్కూల్స్ లో దండనలు శృతిమించుతున్నాయి. స్కూల్ కు లేటుగా వచ్చారని స్టూడెంట్స్ కు పనిష్మెంట్ ఇచ్చింది యాజమాన్యం. పిల్లలు అందరితో డక్ వాక్ చేయించింది. ఇలా చేస్తున్న ఓ స్టూడెంట్ సృహతప్పి పడిపోయాడు. ఆస్పత్రిలో చనిపోయాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలో జరిగింది. స్కూల్ దండనకి స్టూడెంట్ చనిపోవటంతో చెన్నైలో టెన్షన్ నెలకొంది. వివరాల్లోకి వెళితే.. చెన్నై సిటీ తిరువికానగర్ లో ఓ కార్పొరేట్ స్కూల్ ఉంది. ఎం.నరేందర్ (15) పదో తరగతి చదువుతున్నాడు. జనవరి 17వ తేదీ బుధవారం.. స్కూల్ కు ఉదయం 8.30కి హాజరవ్వాలి. అయితే 8.45కి వచ్చాడు. దీంతో యాజమాన్యం స్కూల్ ఆవరణలో డక్ వాక్ చేయాలని ఆదేశించింది. నరేందర్ కూడా డక్ వాక్ చేశాడు. తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. అసలే 10వ తరగతి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఒత్తిడి.. దీనికితోడు లేటుగా వచ్చినందుకు డక్ వాక్ పనిష్మెంట్ తో టెన్షన్ పడ్డాడు నరేందర్. మధ్యలో సృహకోల్పోయాడు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు టీచర్స్. జనవరి 18వ తేదీ గురువారం రాత్రి చనిపోయాడు.

పేరంట్స్ పోలీసులకు కంప్లయింట్ చేశారు. స్కూల్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు.. డక్ వాక్ చేయించిన విషయం నిజమే అని నిర్థారించారు. మోకాళ్లపై నడిపించడం వల్లే నరేందర్ చనిపోయాడని.. తల్లిదండ్రులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళనకు విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చారు. కార్పొరేట్ స్కూల్స్ అరాచకంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చెన్నై సిటీలో ఉద్రిక్తత నెలకొంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy