మోడీకి తోడుగా మరో ఇద్దరు తెలుగోళ్ళు!

images (6)మోడీ కేబినెట్ విస్తరణలో రెండు  తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి చోటు లభించింది.  తెలంగాణలో  ఏకైక  బీజేపీ ఎంపీ  బండారు దత్తాత్రేయకు  మంత్రి  పదవి దక్కింది.  అలాగే  ఆంధ్ర ప్రదేశ్ నుంచి  టీడీపీ రాజ్య సభ సభ్యుడు సుజనా చౌదరిని  మంత్రి పదవి వరించింది.  కొత్త మంత్రుల జీవిత విశేషాలపై  స్పెషల్ స్టొరీ.

అలయ్ బలయ్ అనగానే  గుర్తుకు వచ్చే పేరు…బండారు దత్తాత్రేయ.  హైదరాబాద్ సిటీలో ఏ పార్టీ లీడరైనా…అలయ్ బలయ్ కు రావాల్సిందే. దత్తన్న ను  కలవాల్సిందే.  అందరి వాడుగా పేరు తెచ్చుకున్న బండారు దత్తాత్రేయ ….నూటికి నూరు శాతం ఆరెస్సెస్ మనిషి. 1947 ఫిబ్రవరి 26న  హైదరాబాద్ లో  పుట్టిన  దత్తాత్రేయ….. చదువుకునే రోజుల నుంచే ….ఆరెస్సెస్ ఐడియాలజీ కి  అట్రాక్ట్ అయ్యారు.  జంట నగరాల్లో  ఆరెస్సెస్ యూత్  లీడర్ గా ఎదిగారు. చాలా ఏళ్ల పాటు….ఆరెస్సెస్ ప్రచారక్ గా పనిచేశారు. 1980లో బీజేపీ  పుట్టినప్పటి నుంచీ…పార్టీలో  ఎన్నో  కీలక పదవులు నిర్వహించారు. 1981 నుంచి 89 వరకు  రాష్ట్ర బీజేపీ కి  జనరల్ సెక్రెటరీగా పనిచేసి…పార్టీని డెవలప్ చేశారు. 1991 లో తొలిసారి  సికింద్రాబాద్  నుంచి లోక్ సభ కు ఎన్నికయ్యారు.  1996లో  బీజేపీ  రాష్ట్ర శాఖ  పగ్గాలు  చేపట్టి…కమలం పార్టీని జనంలోకి తీసుకెళ్లారు. 1998లో రెండో సారి….లోక్ సభకు ఎన్నికయ్యారు. 1998- 99 లో కేంద్రంలో  పట్టణాభివ్రుద్ధి శాఖ సహాయ మంత్రిగా  పనిచేశారు. 1999లో మూడో సారి  లోక్ సభకు ఎన్నిక అవడమే కాకుండా…..మరోసారి కేంద్ర మంత్రి అయ్యారు. 2002 నుంచి 2004 వరకు  రైల్వే శాఖ సహాయ  మంత్రిగా పనిచేశారు.  ఈ ఏడాది మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్  నుంచి పోటీ చేసి గెలిచారు.  దత్తాత్రేయ….లోక్ సభకు ఎన్నిక కావడం…..ఇది నాలుగోసారి.  నలభై ఏళ్ల  పొలిటికల్   కెరీర్ ….దత్తాత్రేయ సొంతం. దత్తాత్రేయ….. ప్రస్తుతం బీజేపీకి  జాతీయ  స్థాయిలో  వైస్  ప్రెసిడెంట్ గా , అలాగే  బీసీలకు  సంబంధించిన  కమిటీకి  చైర్మన్ గా  ఉన్నారు.

ఏపీ నుంచి సుజనా చౌదరి

కేంద్ర కేబినెట్ విస్తరణలో  చోటు దక్కించుకున్న రెండో తెలుగువాడు…యలమంచిలి సత్యనారాయణ చౌదరి. బిజినెస్ నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన  సుజనా చౌదరి సొంతూరు కృష్ణా జిల్లా కంచికచర్ల. అయితే, హైదరాబాద్ లో నే  పెరిగారు.  హైదరాబాద్ లోనే ఇంజనీరింగ్ కూడా చేశారు. మొదటి నుంచీ బిజినెస్ పై  ఇంట్రెస్ట్  ఉన్న సుజనా  చౌదరి…1986లో సుజనా గ్రూప్ ఆఫ్  కంపెనీస్  స్టార్ట్  చేశారు.  సుజనా గ్రూప్ పేరుతో ….ఎన్నో  బిజినెస్ లు చేశారు.  అన్ని వ్యాపారాలు…..సుజనా పేరుతో  ఉండటంతో,  పాలిటిక్స్ లోనూ  సుజనా  చౌదరిగానే  పాపులర్ అయ్యారు. సుజనా చౌదరి తెర వెనక ఉండి….టీడీపీ మరింత పాపులర్ కావడానికి  కృషి చేశారు.  టీడీపీ కి ఎప్పుడు…ఏ అవసరం వచ్చినా….ఫండ్స్ ఇచ్చి  ఆదుకున్నారు.  2010లో  రాజ్య సభకు ఎన్నికయ్యారు.  2014 లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ  లీడర్ అయ్యారు. మోడీ కేబినెట్ లో  ఇప్పటికీ  తెలుగువాళ్లు  వెంకయ్య నాయుడు, అశోక్ గజపతి రాజు మంత్రులుగా ఉన్నారు.  తెలుగింటి కోడలు…..నిర్మలా సీతారామన్  కూడా   మంత్రి గా ఉన్నారు.  లేటెస్ట్ గా  దత్తాత్రేయ, సుజనా చౌదరికి చోటు లభించడంతో….కేంద్రంలో  తెలుగుదనం మరింత ఎక్కువగా గుబాళిస్తున్నట్లు అనుకోవాలి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy