కాలేజీకి వెళ్లాల్సినోళ్లను కటకటాల్లోకి పంపిస్తుంది

ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా…యువకులు తమ ఆకతాయి చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. సెల్ఫీల పిచ్చిలో పడి ప్రమాదమని తెలిసినా కూడా రైలు గేటుపై వేలాడుతూ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. శుక్రవారం(ఆగస్టు-3) చెన్నైకి చెందిన కొంతమంది యువకుల ఆకతాయి పని ఇప్పుడు వారి భవిష్యత్తుని ప్రశ్నార్ధకంలో పడేసింది.

నాలుగురోజులుగా 30సెకన్ల నిడివిగల ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో కొంతమంది యువకులు… చెన్నై-అరక్కోణం లైన్ లో కదులుతున్న సబర్బన్ ట్రైన్ గేట్ల దగ్గర నిలబడి బయటకు వేలాడుతూ, బాత్రూమ్ కబోర్డ్స్ పట్టుకొని వేలాడుతూ… పచ్చయాప్ప కాలేజీ అంటూ స్లోగన్లు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ట్రైన్ పుట్లూరు స్టేషన్ కి వచ్చే సమయంలో ఆకతాయిల్లోని ఓ యువకుడు కాలు బాత్రూమ్ కబోర్డ్ లో ఇరుక్కోనిపోయింది. ట్రైన్ స్టేషన్ లో ఆగిన సమయంలో స్టేషన్ లో రైలు ఎక్కేందుకు ఫ్లాట్ ఫాంపై నిలబడిన ప్రయాణికులను భయపెడుతూ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి అనేకమంది యువకులు ఈ విధంగా ఫీట్లు చేస్తూ ప్రాణాలు కోల్పోయారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy