కాలేజీలు అక్కర్లేదు : ఆన్ లైన్ లో డిగ్రీ చదువులు

65th-meeting-education-central-advisory-board-of_041dd5f6-face-11e7-b4bc-5499dc23e9cf

డిగ్రీ చదువుల్లో కొత్త విధానం తీసుకురాబోతున్నది కేంద్రం. ఇప్పటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉన్నట్లుగానే ఆన్ లైన్ చదువులను కూడా తీసుకురాబోతున్నది. ఇందుకు కోసం ప్రణాళిక రూపొందిస్తోంది. ది నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) ఈ విధానానికి రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా హైగ్రేడింగ్ ఉన్న విద్యా సంస్థల్లో ఆన్ లైన్ డిగ్రీ చదువులను తీసుకురాబోతున్నది. ఆన్ లైన్ డిగ్రీ సర్టిఫికెట్ కు.. ప్రస్తుతం కళాశాలలు, యూనివర్సిటీలు అందిస్తున్న డిగ్రీలతో సమాన విలువ ఉంటుంది. సాధారణ డిగ్రీ సర్టిఫికెట్ ఉన్నటువంటి విలువే ఉంటుందని.. స్టూడెంట్స్ కు భయాందోళనలు అవసరం లేదని ప్రకటించింది న్యాక్.

ఇందుకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ వెల్లడించారు. కేంద్ర విద్యా సలహా మండలి(సీఏబీఈ) సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు మంత్రి. దేశవ్యాప్తంగా ‘A ప్లస్‌’, ‘A ప్లస్‌ ప్లస్‌’ న్యాక్‌ స్కోరు ఉన్న 15 శాతం విద్యా సంస్థలు ఈ మూడేళ్ల ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులు అందించనున్నట్లు ప్రకటించారు. క్వచ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసే సామర్ధ్యం ఉన్న యూనివర్సిటీలకే ఈ అవకాశం ఇస్తున్నామని తెలిపారు. ఆన్ లైన్ డిగ్రీ చదువులకు రూపొందించే సిలబస్, పరీక్ష విధానం న్యాక్ రూపొందించే గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఉంటాయని తెలిపారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్న సంస్థలు కూడా ఈ కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలని సూచించారు. అందుకు రెండేళ్ల సమయం ఇస్తున్నట్లు తెలిపారు మంత్రి. లేని పక్షంలో ఆ కోర్సులను మూసివేస్తామని హెచ్చరించారు మంత్రి.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy