కాలేజీ విద్యార్థినిలకు షీ టీం ట్రైనింగ్

SHETEAM1హైదరాబాద్ లో మహిళల భద్రతపై స్పెషల్ కాన్సంట్రేట్ చేశారు పోలీసులు. ఓ వైపు షీ టీమ్స్ ను బలోపేతం చేస్తూనే.. మరోవైపు అత్యవసర పరిస్థితుల్లో స్వయంగా రక్షించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థులకు కరాటే శిక్షణను ప్రారంభించారు. సెల్ప్ డిఫెన్స్ టెక్నిక్స్ పై అవగాహన కల్పించారు. సిటీలోని ఓ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ కు స్టూడెంట్స్ భారీగా హాజరయ్యారు. మహిళలు, విద్యార్థులకు అత్యవసర సమయాల్లో సెల్ప్ డిఫెన్స్ పై అవగాహన ఉండాలన్నారు అడిషనల్ సీపీ స్వాతి లక్రా. దీనికోసమే షీ టీమ్స్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. సమాజంలో మార్పు రావాలంటే ఆత్మ రక్షణ చర్యలు, భద్రత అంశాలపై స్వయంగా అవగాహన ఉండాలన్నారు స్వాతి లక్రా. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు అంతర్జాతీయ కరాటే ప్లేయర్ సైదా ఫలక్. తమకు ఎదురయ్యే ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. సెల్ప్ డిఫెన్స్ లో మార్షల్ ఆర్ట్స్ కీ రోల్ పోషిస్తాయని… సమర్థవంతంగా ఆకతాయిలను అడ్డుకోవచ్చన్నారు సైదా ఫలక్. షీ టీమ్స్ ఆధ్వర్యంలో మరిన్ని సెల్ప్ డిఫెన్స్ ట్రైనింగ్ క్లాసులను నిర్వహించి మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తామన్నారు పోలీసులు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy