కాలేజ్ విషయంలో వెనకడుగు వేయను: పొన్నం

15-ponnam-prabakar-897కరీంనగర్ లో  మెడకల్ కాలేజీ  ఏర్పాటు చేయాలంటూ  ఆమరణదీక్ష  చేస్తున్నారు  కాంగ్రెస్ మాజీ  ఎంపీ  పొన్నం  ప్రభాకర్. కరీంనగర్  తెలంగాణ చౌక్ లో దీక్ష చేసేందుకు… పొన్నంకు  అనుమతివ్వలేదు పోలీసులు.  దీంతో తన ఇంటి ముందే …దీక్ష చేస్తున్నారు  పొన్నం. సీఎల్పీ నేత  జానారెడ్డి,  ఉపనేత జీవన్ రెడ్డిలు.. పొన్నం  దీక్షకు  మద్ధతు తెలిపారు. ఆయనకు  వైద్య పరీక్షలు  చేశారు డాక్టర్లు.

కరీంనగర్ కు మెడికల్ కాలేజీ సాధించే విషయంలో వెనకడుగు లేదన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. మూడేళ్ల కిందిచ్చిన హామీని ప్రభుత్వం మర్చపోయిందన్నారు.  కరీంనగర్ లో కాకుండా సిద్దిపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు నిధులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. రాజకీయ భేషజాలకు పోకుండా.. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ఎన్వోసీ ఇస్తే  ప్రభుత్వాన్ని అభినందిస్తామన్నారు పొన్నం.

ఉదయం పొన్నంకు హారతి ఇచ్చి దీక్షకు పంపారు ఆయన కుటుంబ సభ్యులు. ప్రజల ఆకాంక్ష కోసం పొన్నం ఆమరణ దీక్షకు దిగారన్నరు నేతలు. ఆమరణ దీక్షలు కాకుండ.. నిరవధిక దీక్షలు చేయాలని సూచించారు జానా. అంతకుముందు దీక్ష దగ్గర పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. మధ్యాహ్నాం దీక్ష దగ్గరికి పోలీసులు రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. పొన్నం దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే తామొచ్చింది అరెస్ట్ చేయడానికి కాదని చెప్పారు పోలీసులు. దీక్షతో కరీంనగర్..వేములవాడ రూట్లలో ట్రాఫిక్ జామ్ అవుతుందని, అందరూ సహకరించాలని కోరేందుకు వచ్చినట్లు పోలీసులు చెప్పడంతో కాంగ్రెస్ కార్యకర్తలు శాంతించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy