కాల్వలో పడ్డకారు: ఏడుగురు చిన్నారులు మృతి

గుజరాత్‌లో సోమవారం(ఆగస్టు-13) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 10 మందితో వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి  పక్కనున్న కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురిని పోలీసులు రక్షించారు. ఈ ఘటన గుజరాత్‌లోని పంచమహల్‌లో జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన పిల్లలంతా ఏడు నుంచి పదహారేళ్ల మధ్య వయసువారే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy