
మంగళవారం మేడిగడ్డలో ప్రారంభమవుతున్న యాత్ర..ఎల్లుండి కొండపోచమ్మ సాగర్ దగ్గర యాత్ర ముగుస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు 20 సంవత్సరాలు పట్టేదని, అయితే ఇప్పుడు రికార్డు లెవల్ లో కాళేశ్వరం త్వరగా పూర్తి చేసి చరిత్ర సృష్టిస్తామన్నారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తూనే..కాళేశ్వరం పనులు జరుగుతున్నాయన్నారు. భువనగిరి, ఆలేరు, యాదాద్రి వరకు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్న హరీశ్..రాష్ట్రంలోని సగం జిల్లాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయని తెలిపారు.
కాల్వలు తవ్వి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు. ఈ విషయం మేము చెప్పడంలేదని, కేంద్ర జలవనరుల సంఘం చెప్పిందన్నారు. ఇదే సంఘం ఇప్పడు TRS చేస్తున్న ప్రాజెక్టు డీజైన్స్ చాలా బాగున్నాయని తెలిపిందన్నారు. తెలంగాణ ప్రజలకు సాగునీరు, తాగునీరు ఇవ్వడంలో సీఎం కేసీఆర్ ముందున్నారన్నారు. వేల టన్నుల చేపలు విదేశాలకు ఎగుమతి చేసే రోజులు రానున్నాయని, మత్య్సశాఖను మరింత అభివృద్ధి పరుస్తామన్నారు. కావాల్సినన్ని నీరు ప్రజలకు వస్తాయని, రైతు బోర్లు వేసుకునే అవసరమే ఉండదన్నారు. నల్లొండలో అయితే 400 అడుగులు బోర్లు వేసినా చుక్కనీరు రాదని, దీంతో రైతులు ప్రాజెక్టులపైనే ఆశలు పెట్టుకున్నారన్న హరీశ్..వీలైనంత త్వరగా సాగునీరందిస్తామన్నారు. ప్రపంచంలో సింధు నాగరికత గురించి మాట్లాడుకుంటామని, నీరు ఎక్కడుంటే అక్కడే అభివృద్ధి చెందుతుందన్నారు. కోటి ఎకరాలకు నీరు అందించి సీఎం కేసీఆర్ కలను సాకారం చేసుకునే రోజు రాబోతుందని తెలిపారు మంత్రి హరీష్.