కాల్ గాళ్ వెబ్ సైట్లలో భార్య ఫోన్ నెంబర్

ladyyyకార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా … పెళ్లిలో వినిపించే మంత్రాలివి. ఇన్ని రూపాల్లో భర్తను భార్య పూజిస్తుందని అర్థం. కానీ ఆ దుర్మార్గపు భర్త… భార్యను వేశ్యగా చిత్రీకరించాడు. ఆమె ఫోన్ నెంబర్ ను ఏకంగా కాల్ గాళ్ వెబ్ సైట్ లో పెట్టాడు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్ ఎక్కువ కావడంతో.. ఆందోళన చెందిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు.. ఆ భర్తను అరెస్ట్ చేశారు.

పోలీసులు కథనం ప్రకారం… మలక్ పేట్ తిరుమల హిల్స్ కు చెందిన మురళీ కృష్ణ, భాగ్యలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో భార్య ఫోన్ నెంబర్ ను కాల్ గాల్స్ కు చెందిన వెబ్ సైట్ లో పెట్టాడు. కొన్ని రోజులుగా ఆమెకు విపరీతమైన కాల్స్ వచ్చేవి. అసభ్యంగా మాట్లాడుతూ.. వాళ్లు అడిగే ప్రశ్నలతో విసిగిపోయిన ఆమె.. చివరకు సీసీఎస్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. దర్యాప్తు చేసిన పోలీసులు భర్త మురళీ కృష్ణయే నిందితుడని తేల్చారు. మురళీ కృష్ణను అరెస్టు చేశారు. ప్రేమ పెళ్లితో తనను మోసం చేశాడని.. కోటి రూపాయల కట్నం డిమాండ్ చేశాడని వాపోయింది బాధితురాలు. చివరకు 10 లక్షల రూపాయలు ఇచ్చినా దాహం తీరలేదని.. చివరకు ఈ దాష్టికానికి ఒడిగట్టాడని వాపోయింది బాధితురాలు.  తనలా మరొకరు మోసపోకూడదని..  మురళీ కృష్ణను కఠినంగా శిక్షించాలని కోరింది. నిందితుడి నుంచి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy