కాల్ మనీ : అధికారపార్టీ నేతల అండదండలు

33కాల్ మనీ వ్యవహారంలో ఏపీ సర్కార్ తీరుపైనా విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు కేసును స్లో డౌన్ చేసిందనే ఆరోపణలున్నాయి. విజయవాడ పోలీస్ కమిషనర్ సెలవు వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది.

 

 

సర్కార్ కు తలనొప్పులు

వారం రోజులుగా ఏపీ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కాల్ మనీ వ్యవహారం చంద్రబాబు సర్కార్ కు తలనొప్పిగా మారింది. ఈ మాఫియాలో విపక్ష నేతలతో పాటు.. అధికార పార్టీ నేతలు కూడా ఎక్కువ సంఖ్యలో ఇన్వాల్వ్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో.. కేసు స్లో అవుతుందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.

కమిషనర్ సవాంగ్ యాక్షన్

విజయవాడ కమిషనర్ కదిపిన తేనె తుట్టె తో.. పెద్ద పెద్ద తలకాయలు బయటపడ్డాయి. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో చలించిన సీపీ గౌతమ్ సవాంగ్ తీసుకున్న యాక్షన్ తో..  కేసు డొంక కదిలింది. దీనిపై ప్రభుత్వానికి ముందస్తు సమాచారం లేకపోవడంతో.. కొంతమంది పెద్దలు అసహనం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో.. కమిషనర్ సెలవు వ్యవహారం కూడా కొంత రచ్చ క్రియేట్ చేసింది.

విమర్శలతో వెనక్కి

సీపీ సెలవు వ్యవహారంపై వచ్చిన విమర్శలతో.. డామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది సర్కార్. కమిషనర్ సెలవును రద్దుచేసి… రాజకీయ దుమారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ట్రై చేసింది. కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న విజయవాడ సీపీ గౌతం సవాంగ్… తనపై ఎలాంటి ఒత్తిడి లేదని.. కేసును పూర్తిగా తానే డీల్ చేస్తానంటున్నారు. కేసు పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. నిందితులకు శిక్షలు పడేలా చేయాలంటున్నారు బాధితులు. లేదంటే తమపై కక్షసాధింపు చర్యలు ఉంటాయని భయపడుతున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy