కాల్ మనీ : ఏపీలో అరాచకాలు

CALL MONEY DANDAకాల్ మనీ కేసు.. ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. విజయవాడ, గుంటూరు, నెల్లూరు.. ఇలా ఏపీ లోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో కాల్ మనీ బాధితులు బయట పడుతున్నారు. అధికార, ఆర్థిక బలం ఉన్న వాళ్లు ఊరికో పేరుతో ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు.

 30, 40 రూపాయల వడ్డీ

కాల్ మనీ… ఆంధ్రప్రదేశ్ లో వడ్డీ వ్యాపారానికి ఇది లేటెస్ట్ డైమెన్షన్. అడ్డూ అదుపూ లేకుండా.. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని.. 20, 30, 40 రూపాయల వడ్డీతో.. రోజువారీ వసూళ్లతో బాధితులను జలగల్లా పీడిస్తున్నారు. లక్షల్లో డబ్బుండి.. రాజకీయ అండ కొంత ఉంటే చాలు.. కాల్ మనీ ఆగడాలు చేయడానికి అర్హత సంపాదించినట్లే. అవసరం, ఎంతైనా పర్లేదు అనే స్థాయికి దిగజార్చితే.. అవకాశం, అందిన కాడికి దోచుకునే వెసులుబాటు కల్పిస్తుంది.

చిరువ్యాపారులే టార్గెట్

ఎక్కువగా చిన్న వ్యాపారస్తులు, పేద వాళ్లు ఈ కాల్ మనీ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. రోజువారీ వడ్డీ పేరుతో డబ్బు అప్పు ఇవ్వడం.. ప్రతి రోజూ వడ్డీతో సహా వసూలు చేయడం ఈ వ్యాపారంలో ఆనవాయితీ. ఒక్క రోజు డబ్బు చెల్లించకపోయినా తరువాతి రోజు అసలుకు రెండింతలు ఎక్కువ మనీ కట్టాల్సిందే. అలా ఓ వారం రోజులు కట్టలేని పరిస్థితి వస్తే.. తీసుకున్న దానికి మూడు రెట్లు అసలు.. అంతకు మించి వడ్డీ కట్టాల్సి వస్తుంది.

లైంగిక వేధింపులు

అడ్డూ అదుపూ లేకుండా పేదవాళ్లను దోచుకుంటున్న  ఈ వ్యాపారంలో బాధితులకు లైంగిక వేధింపులు తప్పడం లేదు. తీసుకున్న అప్పుకు గాను ఇల్లు, వాకిలీ వాళ్ల స్వాధీనం లోకి వెళ్లిపోవడంతో పాటు.. ఆడవాళ్లను సైతం బెదిరించి వశపర్చుకునే నీచ సంస్కృతికి ఈ మాఫియా తెరతీసింది. లైంగికంగా లోబర్చుకోవడమే కాకుండా… ఆ వీడియోలు తీసి వారిని బెదిరిస్తూ ఆ ఆడవాళ్లను వ్యభిచార రొంపిలోకి లాగుతున్నారు. అవసరమైనప్పుడు రావాలి.. ప్రముఖుల కోరిక తీర్చి వెళ్లాలి.. లేకపోతే ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేయడం, వీడియోలు బయటపెడతానని బెదిరిస్తుండడంతో అనేక మంది మహిళలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. పోలీసుల సోదాలో ఈ తరహా టేపులు 40కి పైగా దొరికాయి. ఆసరా లేని వాళ్లు.. పేద వాళ్లు.. మహిళలే మెయిన్ టార్గెట్ గా నడుస్తున్న ఈ మాఫియాలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy