కాళేశ్వరం కు కేంద్రం క్లియరెన్స్

kaleshకాళేశ్వరం ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి. వరుసగా కేంద్ర అనుమతులు వస్తున్నాయి. ప్రాజెక్టు రెండో దశకు కేంద్ర అటవీ శాఖ క్లియరెన్సు ఇచ్చింది. దీంతో 15 రోజుల సమయంలో ఆరు ప్రాజెక్టుకు కీలక అనుమతులు వచ్చినట్లైంది. ముందుగా ప్రాజెక్టు మొదటిదశకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది. తర్వాత అటవీ అనుమతి, అంతర్రాష్ట్ర అనుమతి, కేంద్ర భూగర్భ జలశాఖ, కన్ స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీ అనుమతులు వరుసగా వచ్చాయి. కాళేశ్వరం మొదటి దశకు అనుమతి ఇస్తూ కేంద్ర అటవీ శాఖ పెట్టిన నిబంధనలను అమలు చేయడానికి రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు చేసింది. దీంతో రెండోదశకు అటవీ అనుమతులు ఇస్తూ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రెటరీకి కేంద్రం లేఖ పంపింది.

మరో వారంలో కాస్ట్‌ అప్రైజల్, ఇరిగేషన్‌ ప్లానింగ్‌ అనుమతులు రానుండగా.. డిసెంబర్‌ నాటికి పర్యావరణ తుది అనుమతులు వచ్చే అవకాశముంది. ఇప్పటికే వేగంగా జరుగుతున్న ప్రాజెక్టు పనులన్నీ.. అనుమతులన్నీ పూర్తికాగానే శరవేగాన్ని అందుకోనున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టుకు శుక్రవారం(నవంబర్-24) కేంద్ర అటవీ శాఖ కీలకమైన స్టేజ్‌-2 అనుమతులు ఇచ్చింది. ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంపుహౌజ్‌లు, టన్నెళ్ల నిర్మాణానికి అవసరమైన అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా రెవెన్యూ భూముల బదలాయింపు. ఆ భూముల్లో నిర్దేశించిన మేర తిరిగి మొక్కల పెంపకానికి సంబంధించి ప్రభుత్వం రూ.722.30 కోట్లు మంజూరు చేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy