కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని వర్గాల మద్దతు

Harish Raoకాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రజలు, రైతులు, అన్ని వర్గాల వారు మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు మంత్రి హరీశ్‌రావు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యల నివారణ… హరిత తెలంగాణ నిర్మాణానికి ప్రజలు ప్రభుత్వం పక్షాన ఉన్నట్లు ప్రజాభిప్రాయ సేకరణలో తేలిందన్నారు.

రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తాగు, సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్న ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ను ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. ప్రజాక్షేత్రం వదిలిపెట్టి గ్రీన్ ట్రిబ్యునళ్లు కోర్టుల చుట్టు తిరగడం కాంగ్రెస్ నేతలు మానుకోవాలని హితవు పలికారు మంత్రి హరీశ్. 15 జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతంగా ముగిసిందని… గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం స్వేచ్చాయుత వాతావరణం కల్పించిందన్నారు.

చౌకబారు ప్రచారం కోసం ప్రతిపక్షం ఆరాటపడొదన్న మంత్రి హరీశ్… రాష్ట్ర తాగు, సాగునీటి ప్రాజెక్టులకు ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy