కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో రెండు అనుమతులు

kaleshwaram-perరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో రెండు అనుమతులు మంజూరయ్యాయి. కేంద్ర భూగర్భ జల శాఖ నుంచి, కన్ స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీ డైరెక్టరేట్ నుంచి పర్మిషన్లు వచ్చాయి. త్వరలోనే మరికొన్ని కీలక అనుమతులు లభించే అవకాశముందని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

అంతకు ముందు ఢిల్లో పర్యటనలో పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పూర్తికి సహకరించాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఇప్పటికే మొదటి దశ అనుమతులు లభించాయని, రెండో దశ అనుమతులు, పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అనుమతుల ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలను సమన్వయ పరచాలని రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులపై కూడా గడ్కరీతో మాట్లాడారు హరీష్.

విజ్నప్తులపై గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు హరీష్ రావు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన అన్ని అనుమతులు, నిధుల విషయంలో సహకరిస్తారని హామీనిచ్చారన్నారు. తర్వాత కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయమంత్రి సుజనా చౌదరిని కలిశారు హరీష్. హైదరాబాద్ లో త్వరలో జరగనున్న సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లపై చర్చించారు. ఢిల్లీ పర్యటనలో హరీష్ వెంట ఎంపీలు బూర నర్సయ్య, బీబీ పాటిల్ ఉన్నారు.

మరోవైపు ఢిల్లీలో ఉక్కుశాఖ  కార్యదర్శిని కలిశారు MP  సీతారాం నాయక్.  బయ్యారంలో  ఉక్కు ప్లాంట్   ఏర్పాటుపై మాట్లాడారు . దీనిపై  6 నెలల్లోనే  కమిటీ రిపోర్ట్  ఇవ్వాల్సి  ఉన్నా… మూడేళ్లయినా  కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం  లేదన్నారు. కేంద్రం  స్పందించక పోతే  వచ్చే పార్లమెంట్  సెషన్లో  పోరాడతామన్నారు సీతారాంనాయక్.

తర్వాత కేంద్ర ఆయుష్  కమిటీ  బోర్డు సభ్యులను  కలిశారు సీతారాం నాయక్. రామప్ప,  లక్నవరం, భద్రాచలంలో  హెర్బల్  గార్డెన్  ఏర్పాటు చేయాలని  కోరారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy