కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం వరంగల్ కే:మంత్రి హరీశ్‌

harishరాష్ట్రలోని ప్రజలందరికీ కనీస వసతి అయిన నీటిని అందించడమే లక్ష్యంగా కేసీఆర్‌ సర్కార్‌ పనిచేస్తోందన్నారు మంత్రి హరీష్ రావు. భూపాలపల్లికి కానుకగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని…కాళేశ్వరం మొదటి ఫలితం వరంగల్‌కే దక్కుతుందన్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టూర్లో బిజిబిజీగా గడిపారు స్పీకర్ మధుసూదనాచారి, మంత్రి హరీష్ రావు. హైద్రాబాద్ నుంచి హెలికాప్టర్లో భూపాలపల్లి జిల్లా గణపురం చేరుకున్న నేతలకు ఘనంగా స్వాగతం పలికారు నేతలు. కాకతీయులకాలం నాటి గణప సముద్రం చెరువును సందర్శించారు. తర్వాత వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని రామప్ప చెరువును పరిశీలించారు.  రామప్ప ఆలయానికి వెళ్లిన నేతలకు అర్చకులు ఆలయ సాంప్రదాయాలతో స్వాగతం పలికారు.  శ్రీరామలింగేశ్వర స్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయ పరిసరాల్లో తిరిగిన మంత్రులకు రామప్ప ఆలయ చరిత్రను వివరించారు అధికారులు. అక్కడ నుంచి  కేశవపురం దగ్గర 17 కోట్ల రూపాయలతో హెడ్ రెగ్యులెటర్ పనులకు శంకుస్థాపన చేశారు హరీష్.

కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం ఉమ్మడి వరంగల్ జిల్లాకే వస్తుందన్నారు నేతలు. తర్వాత  గోదావరి జలాలతో  నింపనున్న రామప్ప-లక్నవరం లింక్ కెనాల్  పనుల పురోగతి, దేవాదుల ప్రాజెక్టుల పనుల తీరుపై  భూపాలపల్లి జెన్ కో గెస్ట్ హౌజ్ లో రివ్యూ చేశారు. భూపాలపల్లి జిల్లాలో లక్షా 90 వేల సాగు భూమి ఉందని…. అందుకు అనుకూలంగా సాగునీరందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు స్పీకర్ మధుసూధనాచారి.

కాకతీయ రాజులు ఏర్పాటు చేసిన రామప్ప, లక్నవరం, పాకాల చెరువులకు దేవాదుల నీళ్లు తెచ్చే పనులు త్వరగా పూర్తిచేస్తామన్నారు మంత్రులు. రామప్ప నుండి ములుగు ఘనపురంకి నీళ్లివ్వడంతో 24 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు కొత్తగా 12 వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు మంత్రి హరీష్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. 15 రోజులకోసారి జిల్లాలో పర్యటిస్తానన్న మంత్రి హరీష్…. ఎప్పటికప్పుడు SRSP కాలువల ఆధునీకరణ పనులపై సమీక్ష చేస్తానని చెప్పారు. తర్వాత తుపాకులగూడెం వెళ్లిన నేతలు బ్యారేజీ పనులను పరిశీలించారు. బ్యారేజీ పనులు నెమ్మదిగా జరుగుతుండడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. సకాలంలో పనులు పూర్తి చేయలేకపోతే అధికారులు, కాంట్రాక్టరే బాధ్యత వహించాలన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy