కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శం: కేంద్ర జలసంఘం

kaleshwaramకాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే ఆదర్శమంటూ కేంద్ర జలసంఘం అధికారులు ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును వారు పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ రూపురేఖలు మారిపోతాయన్నారు. దేశంలోనే ఓ చారిత్రక ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిలుస్తుందన్నారు. ప్రాజెక్టు పనులను కేంద్ర జలసంఘం హైడ్రాలజి డైరెక్టర్ NN రాయ్, సీఈ సీకేఎల్ దాస్‌తో పాటు పలువురు పరిశీలించారు.

కాళేశ్వరం పనులు అత్యంత వేగవంతంగా కొనసాగుతున్నాయని.. ఇంత స్పీడ్ గా ప్రాజెక్టు పనులు జరగడం ఎక్కడా చూడలేదన్నారు NN రాయ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. మేడిగడ్డ దగ్గర  నీటి లభ్యతకు సంబంధించి ఏ సమస్యా లేదని రాయ్ స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. దేశంలోనే కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అవుతుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు CKL దాస్. మే లేదా జూన్ నెలలో ప్రాజెక్టు తొలి ఫలాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని స్పష్టం చేశారు. కాళేశ్వరం ద్వారా ఇతర ప్రాజెక్టుల ఆయకట్టు కూడా స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు. ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణాలు, పనులు సాగుతున్న తీరు చాలా బాగుందన్నారు. దేశంలో ఏ ఇతర ప్రాజెక్టులోనూ ఇటువంటి పనులు చూడలేదని తెలిపారు. నిర్దిష్ట గడువులోపు ప్రాజెక్టులు పూర్తి చేయడం ప్రస్తుతం సవాలుగా మారిందని సీకేఎల్ దాస్ అన్నారు. కాళేశ్వరం పనులు చూస్తుంటే సమస్యను సలువుగా అధిగమిస్తారనిపిస్తోందన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మిగతా పర్మిషన్లు పరిశీలనలో ఉన్నాయన్నారు దాస్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy