కాళేశ్వ‌రం ప‌నుల్లో విషాదం: ఆరుగురు కూలీలు మృతి

kaleshwaramకాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో విషాదం  జరిగింది. సొరంగం పైకప్పు కూలి ఆరుగురు కూలీలు అక్క‌డికక్క‌డే చనిపోయారు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘ‌ట‌న బుధ‌వారం (సెప్టెంబర్20) సాయంత్రం జ‌రిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ టన్నెల్‌ మార్గంలో పని చేస్తున్న సమయంలో పేలుడు సంభవించింది .మధ్యమానేరు నుంచి మల్లన్నసాగర్‌ వరకు జరుగుతున్న ప్రాణహిత-చేవేళ్ల 10 వ ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ పనులు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఈ పనులు పూర్తికానున్న సమయంలో ఈ ఎయిర్ బ్లాస్టింగ్‌ జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్పీ విశ్వజిత్ ఘ‌ట‌నాస్థలికి చేరుకున్నారు. సంఘటనా స్థలిని పరిశీలించారు. ప్రమాదంలో గాయపడినవారిని కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఝార్ఖండ్‌, బీహార్‌, ఒడిషాకు చెందిన కూలీలు ఈ పనుల్లో పాల్గొంటున్నారని… ప్రమాద సమయంలో ఎనిమిది మంది పనిచేస్తున్నారని తెలిపారు ఎస్పీ. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy