కావాలనే బ్యాడ్ టాక్.. స్క్రీన్ వెనకాలే కుట్రలు : అల్లు అరవింద్

ALLUఈ మధ్య ఇండస్ట్రీలో మనసు  కలిచి వేసే సంఘటనలు జరిగాయన్నారు నిర్మాత అల్లు అరవింద్. ఆదివారం (ఏప్రిల్-29) అల్లు అర్జున్ హీరోగా నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా  ప్రీరిలీజ్‌ వేడుక హైదరబాద్ లో జరిగింది. ఈ వేడకకు హాజరైన అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఫిలిం ఇండస్ట్రీలో ఈ మధ్య కుశించుకు పోయేలాగ.. మనసుకు బాధ కలిగే లాగ.. ఇండస్ట్రీలో ఉన్న అందరూ ఎంతో కొంత మదన పడేలాగా కొన్ని విషయాలు జరిగాయన్నారు.

ఆ విషయాల మీద మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని.. దీంతో ఈ సినిమాను ఓ తప్పుదోవ పట్టించడానికో.. ఓ మిక్స్‌ డ్ టాక్ తీసుకురావడానికో.. ఒక క్రిటిసైజ్ చేయడానికో ప్రయత్నిస్తున్నారన్నారు.  ఈ సినిమా గురుంచి కొందరు కావాలని బ్యాడ్ టాక్ తెస్తారని.. అవి నమ్మకుండా ప్రేక్షకులు దాటి ఈ సినిమాను ఆదరించాలన్నారు. సినిమా బాగుంటే మీరే దాన్ని ఎత్తుకుంటారు అని తెలిపారు అల్లు అరవింద్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy