కాశ్మీర్ భారత ఆంతరంగిక సమస్య కాదు: నవాజ్

nawazహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాక్ లో అడుగుపెట్టిన మరుక్షణం ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ మరింత రెచ్చిపోయారు. కాశ్మీర్ లో ప్రస్తుతం ఓ ఉప్పెనలా స్వాతంత్ర్య పోరాటం సాగుతోందని, వారికి తమ బాసట ఉంటుందని ప్రకటించారు. మూడు రోజుల పాటు జరిగిన దౌత్యవేత్తల సదస్సులో ప్రసంగిస్తూ ప్రపంచ వేదికలపై భారత నీతిని ఎండగట్టాలని, కాశ్మీర్ ను హైలైట్ చేయాలని పిలుపునిచ్చారు. పాక్ విదేశాంగ విధానానికి కాశ్మీర్ ఓ ఆయువు పట్టని చెబుతూ ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు అనుగుణంగా సమస్య పరిష్కారం జరగాల్సిందేనన్నారు. కాశ్మీర్ ఇక ఎంత మాత్రం భారత ఆంతరంగిక వ్యవహారం కాదన్నారు. హిజ్బుల్ కమాండర్ బుర్షన్ వానీ ఎన్ కౌంటర్ ను ప్రస్తావిస్తూ సమస్య తీవ్రత జులై 8 నాటి పరిణామాలు విశదం చేస్తున్నాయని, మూడో తరం కాశ్మీరీలు ప్రస్తుతం క్షోభ అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజ్ నాథ్ సార్క్ వేదికపై గళమెత్తకముందే షరీఫ్ భారత్ ను గుచ్చేట్లుగా ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy