కాసేపట్లో మొదలవనున్న పార్లమెంటు సమావేశాలు

57176ఇవాళ్టి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అధికార పార్టీపై దండెత్తటానికి అస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి విపక్షాలు. తెలంగాణతో పాటు పలు కీలక బిల్లులు సమావేశాల్లో చర్చకు రానున్నాయి. 15 వ లోక్ సభ చివరి సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయి. తెలంగాణ, మహిళా రిజర్వేషన్, అవినీతి వ్యతిరేక, ఆర్థిక బిల్లులు  పార్లమెంటులో చర్చకు రానున్నాయి. అధికార పార్టీ తో పాటు ప్రధాన ప్రతిపక్షం బీజేపీ  ఆఖరి సమావేశాలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. సమస్యలపై సర్కార్ ను నిలదీసేందుకు అస్త్రాలతో సిద్ధమయ్యాయి మిగిలిన పార్టీలు.  ఈ సమావేశాల్లో టీ బిల్లు ప్రధాన ఎజెండా కానుంది. మిగిలిన వాటికంటే తెలంగాణ అంశంపైనే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఫోకస్ పెట్టాయి. టీ బిల్లును ఆమోదించడం ద్వారా తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది  కాంగ్రెస్. అయితే బిల్లు పాస్ కావాలంటే బీజేపీ మద్దతు కీలకం. దీంతో సీమాంధ్ర సమస్యలను ప్రస్తావించడం ద్వారా ఆ ప్రాంత ప్రజల మనసు గెలుచుకోవాలని స్కెచ్ వేస్తోంది కమలం పార్టీ. విభజనపై కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూనే తమ మద్దతు వల్లే టీ బిల్లు పాసైందని చెప్పుకునేందుకు ప్లాన్ చేస్తోంది. చివరి సమావేశాలు గుర్తిండిపోయేలా సాగాలన్నారు స్పీకర్ మీరాకుమార్ . సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని అఖిలపక్ష భేటీలో నేతలకు విజ్ఞప్తి చేశారు. దేశ చరిత్రలో అతి తక్కువ పనితీరు కనబరిచింది 15 వ లోక్ సభేనన్నారు.

చివరి సమావేశాల తరువాతే ప్రజాపోరు ఉండడంతో.. సభలో.. అనుసరించే వ్యూహాల ద్వారా.. లబ్దిపొందేందుకు.. అధికార విపక్షాలు యత్నాలు మొదలుపెట్టాయి.  మరి ఎవరి ఎత్తులు పై ఎత్తులు ఫలిస్తాయో చూడాలి.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy