కింద పడకుండా జాగ్రత్త : ఆస్పత్రి బెడ్ పై తాళ్లతో కట్టేసి ట్రీట్ మెంట్

treteరైలు యాక్సిడెంట్ తో గాయాలపాలైన ఇద్దరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లోని జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీలో శుక్రవారం(మార్చి30) ఇద్దరు అడ్మిట్ అయ్యారు. అయితే ట్రీట్ మెంట్ సమయంలో ఎమర్జెన్సీ వార్డులో వారి కాళ్లు, చేతులను డాక్టర్లు కట్టిపడేశారు. దీంతో హాస్పిటల్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

అయితే వారిని సీనియర్ డాక్టర్లు ట్రీట్ చేశారని, తమ హాస్పిటల్ లోని బెడ్ లకు సైడ్ గార్డ్స్ లేవని వివరణ ఇచ్చింది ఆస్పత్రి. పేషెంట్ల తరపున కూడా ఎవరూ రాలేదన్నారు. తమ స్టాఫ్ కూడా ఎక్కువసేపు బెడ్ దగ్గరే కూర్చోవడం సాధ్యం కాదు కాబట్టే అలా కట్టేశాం అని వివరణ ఇచ్చారు. మేం దగ్గర లేనప్పుడు బెడ్ పైనుంచి కింద పడితే మళ్లీ గాయలు అవుతాయని.. అందుకే ముందు జాగ్రత్తగా అలా చేశాం అని చెప్పుకొచ్చారు. కింద పడకుండా ముందు జాగ్రత్తగానే కాళ్లను కట్టేశాం అని బాజాప్తా ప్రకటించారు జవహర్ లాల్ మెడికల్ కాలేజీ CMO ఎస్ హెచ్ జైదీ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy