కిక్ స్టంట్ : 24 అంతస్తుల నుంచి దూకి బతికిపోయాడు

juyస్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లో ఓ వింత జరిగింది. కిక్ కోసం ఓ యువకుడు 246 అడుగుల ఎత్తున 24 ఫోర్ల బిల్డింగ్ పై నుంచి దూకాడు. అయితే ఆ యువకుడు మాత్రం సేఫ్ గా బతికిపోయాడు.

స్టంట్ చేయాలని భావించిన 24 ఏళ్ల స్టాక్ హోమ్ యువకుడు 24 ఫోర్లు ఉన్న బిల్డింగ్ పైనుంచి దూకాడు. ఆ సమయంలో అతడు ధరించిన పారాచూట్ తెరుచుకోలేదు. దీంతో 10 సెకన్లలోనే కింద ఉన్న కాంక్రీట్ వాల్ ను ఢీకొని పడిపోయాడు. అతడిని అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించారు. పెద్ద గాయాలు అయినప్పటికీ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని డాక్టర్లు తెలిపారు. ఈ కిక్ స్టంట్ ను వీడియో తీశాడు స్నేహితుడు. బిల్డింగ్ పైనుంచి కిందకి దూకుతుండగా ప్యారాచ్యూట్ ఓపెన్ కాకపోవటం కనిపిస్తోంది. అప్పుడే వీడియో తీస్తున్న స్నేహితుడు OMG అంటూ కేకలు వేస్తాడు. అదృష్టం కొద్దీ బతికిపోయాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy