కిడ్నాప్ చేసిన బాలిక విడుదలకు 25 కోట్లడిగారు

kidnap girlబీహార్ లోని కతిహార్ జిల్లాలో ఓ ఐదేళ్ళ పాపను కొందరు కిడ్నాప్ చేశారు.. స్థానికంగా ఉండే ఓ వ్యాపారి భాను అగర్వాల్ కూతురైన ఆ చిన్నారిని నేపాల్ లోకి తీసికెళ్ళి సరిహద్దు గ్రామమైన విరాట్ నగర్ లో ఓ చోట దాచారు. ఆమెను విడుదల చేయాలంటే పాతిక కోట్లు ఇవ్వాలని షరతు పెట్టారు.. దాంతో అంత డబ్బు ఇవ్వలేని అగర్వాల్ పోలీసులను ఆశ్రయించాడు. వారు అతనికి వచ్చిన ఫోన్ కాల్ ను ట్రేస్ చేయగా ఆ కాల్ వచ్చిన ఫోన్ మాజీ పార్లమెంట్ సభ్యుడు నరేష్ యాదవ్ కుమారుడిదని తేలింది. ఆ కుమారుడిని అరెస్ట్ చేసి ప్రశ్నించగా.. కొందరు కిడ్నాపర్లు పాప స్కూల్ నుంచి వస్తూండగా బస్సు ఆపి దించి తీసికెళ్ళారని చెప్పాడు. కిడ్నాపర్లలో ఒకడు ఆ స్కూల్ మాజీ డ్రైవర్ అని చెప్పాడు. పోలీసులు ఆ సమాచారం ఆధారంగా నేపాల్ లో వల పన్ని కిడ్నాపర్లను అరెస్ట్ చేసి పాపను విడిపించారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy