
ఇప్పటికీ నేనే సభా నాయకున్నని, ఆ హోదాలోనే బిల్లు తిరస్కరణ నోటీసులు ఇచ్చానని ఆయన అన్నారు. కేంద్ర హోం శాఖ రాష్ట్రపతిని కూడా మోసం చేసినట్టు కనబడుతుందని కిరణ్ అన్నారు. హోం శాఖ, కేంద్రానికి చాలెంజ్ విసురుతూ, దమ్ముంటే ఇదే బిల్లును పార్లమెంటు లో పెట్టాలని, అలా చేయగలిగితే తాను రాజకీయాలనుండి తప్పుకుంటానని కిరణ్ అన్నారు. ఆర్టికిల్ 3 ప్రకారం రాష్ట్రపతిదే పూర్తీ అధికారం, అసెంబ్లీకి తిరస్కరించే అవకాశం లేదంటున్న వారు ఓటింగ్ కు ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదు; బిల్లుకు, ముసాయిదాకు తేడా ఏంటో జైరాం రమేష్ తెలుసుకోవాలి; తానెక్కడా నిరాహార దీక్ష చేస్తాననలేదు అంటూ కిరణ్ మాట్లాడారు.
బిల్లు చర్చకు రేపటితో గడువు ముగుస్తున్న నేపధ్యంలో కిరణ్ చివరి బ్యాటింగ్ లాంటి ఈ మాటల ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి.