కిరణ్ చేతిలో కొత్త రాయి: ఆర్టికల్ 131?

scసమావేశాల పొడిగింపుకు అభ్యర్ధన, మొత్తంగా బిల్లు తిరస్కరణకు నోటీసు, ఇలాగే పార్లమెంటు లో ప్రవేశపెట్టమని సవాలు… ఇప్పుడు కిరణ్ T బిల్లుపై విసరడానికి మరో కొత్త రాయిని వెతుక్కున్నట్లు తెలుస్తుంది. విభజన ప్రక్రియపై కేంద్రం దూకుడు చూసిన సీమాంధ్ర నాయకత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ను ఆధారంగా చేసుకుని సుప్రీం కోర్టులో ‘ఒరిజినల్ సూట్’ దాఖలు చేయాలని యోచిస్తున్నట్లు కొన్ని వర్గాలు తెలుపుతున్నాయి. కిరణ్ టీం లోని కొందరు ఇప్పటికే ఢిల్లీలోని సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తుంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాల విషయంలోనే ఉపయోగానికి ఉద్దేశించిన ఈ ఆర్టికల్ ప్రస్తుత స్థితుల్లో వాడడాన్ని సుప్రీం కోర్టు ఎంతవరకు సమర్దిస్తుందనేది పెద్ద ప్రశ్న. ఆర్టికల్ 3 కింద రాష్ట్రపతికి ఉండే విశేష అధికారాలను ఆర్టికల్ 131 ప్రశ్నించడం సాధ్యమా అనేది మరో ప్రశ్న. విభజన ప్రక్రియ ఇంకా పార్లమెంటునే చేరనందున ఈ అంశం పై కేసును కోర్టు స్వీకరించకపోయే అవకాశం కూడా ఉంది.

అయితే సాధ్యాసాధ్యాల మాట ఎటున్నా, అంతిమ ఫలితంతో కూడా సంబంధం లేకుండా ప్రక్రియ ప్రస్తుత దశలో ఆగిపోతే చాలుననేదే లక్ష్యంగా ఉన్న సీమాంధ్ర లాబీ ఈ పని కూడా చేసే అవకాశాలు ఉంటాయనే చెప్పవచ్చు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy