కిరణ్, లగడపాటి కాంగ్రెస్ ను నాశనం చేశారు: ఎంపీ వివేక్

download
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్ నాశనం చేశారని మండిపడ్డారు పెద్దపల్లి ఎంపీ వివేక్. సీమాంధ్ర ప్రజలను వాళ్లిద్దరు తప్పుదోపపట్టించారని విమర్శించారు. ప్రజలే వాళ్లకు సరైన గుణపాఠం చెప్పాలన్నారు. ఇలాంటి చీడపురుగులు కాంగ్రెస్ ఉండకూడదన్నారు. తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియాదే అన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ కావడంతో ప్రధానితో ప్రత్యేకంగా భేటీ కానున్నారు ఎంపీ వివేక్.

తెలంగాణకు అన్ని పార్టీలను ఒప్పించిన ఘనత కేసీఆర్ దే అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. తెలంగాణ రాష్ట్రం ప్రకటించినందుకు సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. నవ తెలంగాణను ఆత్మహత్యలు లేని సుసంపన్న రాష్ట్రంగా తీర్చుకుందామన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణానికి అంకితమవుతామన్నారు ఈటెల.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy